Monday, December 23, 2024

నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ!

- Advertisement -
- Advertisement -

Raghavendra rao birthday

 

దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు ఈరోజు పుట్టినరోజు జరుపుకోనున్నారు. సోమవారం నాడు ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ జన్మదినం సందర్భంగా కె.రాఘవేంద్రరావు తన సినీ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడు తూ… దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. ‘అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్‌టిఆర్‌పై తొలిసారి క్లాప్ కొట్టడంతో నా కెరీర్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకా శం ఇచ్చారు.

10 ఏళ్లపాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.యస్.ప్రకాశ్‌రావుగారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో నా సినీ సినిమా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు, అవార్డులు, రివార్డులు ఎన్నోచూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో “నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ”అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఈ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను.

అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి “అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం… అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు, విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం…” అంటూ తన బుక్ గురించి చెప్పారు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News