Wednesday, March 26, 2025

కన్నప్పను ట్రోల్ చేస్తే.. శివుడు శాపమిస్తాడు: ప్రముఖ నటుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ సినిమా ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఏప్రిల్ 25వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

అయితే సోషల్‌మీడియాలో వచ్చే వస్తున్న ట్రోల్స్‌ని పెద్దగా పట్టించుకోను అని మంచు విష్ణు అన్నారు. ‘బుక్‌ మై షో’ అధ్వర్యంలో నిర్వహించిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రోల్స్‌ గురించి ఆయన్ను ప్రశ్నించగా.. ‘వివాదం సృష్టించాలనుకుంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్మార్ట్‌గా ఆలోచించి అసలు విషయం తెలుసుకుంటారు’ అని అన్నారు. అయితే పక్కనే ఉన్న ప్రముఖ నటుడు రఘుబాబు వెంటనే మైక్ లాక్కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే.. శివుడి కోపానికి, శాపానికి గురవుతారు. 100 శాతం చెబుతున్నా.. ట్రోల్ చేస్తే ఫినిష్ అంతే’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News