Monday, December 23, 2024

మెదక్ సీటుపై కేసీఆర్ కుటుంబంలో గొడవలు?

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటుకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ సీటు కోసం కవిత పట్టుబడుతున్నారని, ఇది నచ్చని హరీశ్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టారని ఆరోపించారు. ఆయన ప్రోద్బలంతోనే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారంనాడు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారని రఘునందన్ అన్నారు. వారు  కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఇదిలాఉండగా తాము కాంగ్రెస్ లో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలను మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ విషయమై రకరకాల ఊహాగానాలు చెలరేగడంతో వారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చేందుకే తాము కలిశామని, దీనిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. తాము కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News