- Advertisement -
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ నుంచి ఎంపిగా పోటీ చేస్తానని ఆ పార్టీ నేత రఘునందన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో డబ్బులు పంచడంతోనే బిఆర్‌ఎస్ విజయం సాధించిందని ఆరోపణలు చేశారు. సిపికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దుబ్బాక్ నుంచి పోటీ చేసి రఘునందన్ ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో రఘునందన్‌పై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 53 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రభాకర్ రెడ్డి గెలిచారు.
- Advertisement -