Sunday, December 22, 2024

దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆయన ఈ పుస్తకాన్ని మంగళవారం విడుదల చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన బుక్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పోస్టులో పంపించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్లు, రోడ్లు, ఉపాధి నిధులకు సంబంధించిన వివరాలను పుస్తకంలో పరిచినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు రూ.4.23 లక్షల చొప్పున అందించినట్లు పేర్కొన్నారు. రైతు వేదికలకు రూ.10 లక్షల చొప్పున నిధులు అందించామన్నారు. వైకుంఠదామాలకు రూ.11.13 లక్షల చొప్పున అందించినట్లు వెల్లడించారు.

దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. డంప్ యార్డులకు రూ.2.5 లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు. దుబ్బాకతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ వివరాలను కూడా పంపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఏమార్చి ఓట్లు దుండుకొని ఇప్పుడు పాంచ్ న్యాయ్ అంటూ మరో అబద్ధానికి తెరలేపిందని విమర్శించారు. ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రానికి బిఆర్‌ఎస్ చాలా అన్యాయం చేసిందని ఆరోపించారు. బిజెపికి అవకాశమిస్తే, మోడీ మరోసారి ప్రధాని అవుతారన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా మాట్లాడతామంటే ప్రజలు అంగీకరించరన్నారు. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో మోడీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనని గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News