Thursday, January 23, 2025

మెదక్ లో బిఆర్ఎస్ కు స్థానికులు దొరకటం లేదా..?: రఘునందన్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా కనిపించట్లేదని బిజెపి మాజీ ఎంఎల్ఏ రఘునందన్ రావు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీని పదేళ్లు పాటు చేయలేదని ఆరోపించారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కూడా చేయలేదని రఘునందన్ మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే బిజెపి ఎంపిలను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. మెదక్ బిఆర్ఎస్ స్థానికులు దొరకటం లేదా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ నుంచి తీసుకొచ్చి హరీశ్ రావును మెదక్ లో రుద్దారని ఆరోపించారు. హరీశ్ రావు చాలదన్నట్లు ఇప్పడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారని రఘునందర్ పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డిది ఏ జిల్లా.. ఏ ఊరో ఆయనకే తెలియదన్నారు. కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి ప్రజలను దోచుకున్నారని రఘునందర్ వెల్లడించారు. దోచుకున్న డబ్బులు ఖర్చపెట్టి గెలవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News