Sunday, January 5, 2025

కాంగ్రెస్ తో మేము కలిస్తే నీకీపాటికి చిప్పకూడే:రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్వీట్లు పెట్టకుండా చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నీ పనికి మాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదని, మెదడు కూడా కోల్పోయావని స్పష్టమవుతుందన్నారు. ప్రధాని మోడీతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ కి సంబంధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా రాష్ట్ర బీజేపీ నేతలంతా ’కలిసికట్టుగా పని చేయండి’ అనే శీర్షికతో వచ్చిన కథనాన్ని ఎక్స్ లో షేర్ చేస్తూ కేటీఆర్ పోస్టు చేశారు. మోడీ గారు మీ కమలం నేతలు, కాంగ్రెస్ నేతలు కలిసిపోయి మరీ కలిసికట్టుగా పని చేస్తున్నారని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రఘునందన్ రావు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తే కేటీఆర్ ఈ పాటికే జైలు పాలు అయ్యేవారన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కేటీఆర్ చిన్నాభిన్నాం చేశారని విమర్శించారు. నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదని మండిపడ్డారు. నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదు, నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే నేడు ప్రజలకు ముఖం చూపలేక ఫాంహౌస్ కు పరిమితమయ్యారని, నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు మెదడు కూడా కోల్పోయావని స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News