Thursday, December 19, 2024

ప్రజాపాలనకు ఆరు నెలలయ్యాయి…కానీ ఆరు గ్యారంటీలు అమలు కాలే: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాడానికి గుప్పించిన ఆరు గ్యారంటీలు, ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల అమలు గురించి ప్రశ్నించారు.

తన సోషల్ మీడియా పోస్ట్ లో రఘునందన్ రావు ‘‘ఇవి గుర్తున్నాయా ఎవరికైనా?? రాష్ట్ర ప్రజలు లైనులో నిలబడి ఫామ్ నింపి ఆరు నెలలు అయింది. కానీ ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకాలే!! పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల మీద లేకపాయే!! ఇదేనా తెలంగాణలో ప్రజా పాలన అంటే??’’ అంటూ నిలదీశారు.

ఇదిలావుండగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. అలా పార్టీ మారడం ఆగడం లేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News