Sunday, January 19, 2025

సిఎంకు మా ఇల్లు చూపిస్తా: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాక వస్తే తన ఇల్లు చూపిస్తానని బిజెపి మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపి అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శనివారం మెదక్ లో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. కొన్ని సార్లు పోటీచేసే స్థానాలు మారడం సాధారణమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ముదిరాజ్ లకు చేసిన మేలు ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ చెప్పాలి? అని ఆయన డిమాండ్ చేశారు. మాకు గడీలు ఉన్నాయన్నారు.. ఎక్కడున్నాయో చూపించాలన్నారు. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందర్ కోరారు. మెన్న ఆదిలాబాద్ లో మోడీని పెద్దన్న అన్న రేవంత్ నేడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు మర్చిపోవటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News