కష్టాల కడలిలో గురుకుల విద్యార్థుల ప్రాణాలు, భవిష్యత్ ఉందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థినికి 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నిచారు. ఖమ్మం ఘటన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. ఖమ్మం, దానవాయిగూడెం బీసీ బాలికల గురుకుల హాస్టల్‌లో ఓ విద్యార్థినిని ఎలుకలు కొరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదని,
గురుకులాల్లో రోజు రోజుకు దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా అని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల భవిష్యతు అంధకారంలో ఉగుసలాడుతుందని విమర్శలు చేశారు. ఇక భవిష్యతులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.