Sunday, December 29, 2024

ఈడీ విచారణను కెటిఆర్ ఎదుర్కోవాల్సిందే:రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ -కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని మెదక్ బిజెపి ఎంపి రఘునందన్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి చెప్పకుండా కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి తరలించినందుకే కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కెటిఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు శనివారం స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసినా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈడీ విచారణను కేటీఆర్ కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని రఘునందన్ రావు చెప్పారు. దమ్ముంటే తనను అరెస్ట్ చెయ్ అంటూ ట్వీట్ చేసిన ట్విట్టర్ టిలు కేసు నమోదు కాగానే కోర్టుకు వెళ్లాడని రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు దమ్ముంటే జైలుకు వెళ్లాలని, జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News