Monday, December 23, 2024

నిరంజన్ రెడ్డి సవాల్ పై స్పందించిన రఘునందన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్‌పై బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు స్పందించారు. నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ తెలిపారు. తన వ్యాఖ్యలపై స్పందించి తనని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిరంజన్ రెడ్డి ఎప్పుడు పిలిచిన వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నిరంజన్ రెడ్డి కేవలం వనపర్తికి మంత్రిగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ చురకలంటించారు. తన కుటుంబానికి మొత్తం 90 ఎకరాల భూమి ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. తాను మంత్రి పదవి రాకముందే ఈ భూమి ఉందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Also Read: శ్వాససమస్యలపై అశ్రధ్ధ వద్దు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News