Monday, December 23, 2024

ఉత్తమ పంచాయతీగా రఘునాథపాలెం

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా మండల కేంద్రమైన రఘునాథపాలెం గ్రామపంచాయితీ ఎంపికైంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో సర్పంచ్ గుడిపూడి శారద రామారావు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌కుమార్‌లు అవార్డులు అందుకున్నారు.

గత ఏడాది పంచాయితీలో హరితహారం కార్యక్రమం ద్వారా మండల బృహత్తర పల్లె ప్రకృతి వనం, గ్రామ ప్రకృతి వనం, చెరువు కట్టలు, ప్రభుత్వ కార్యాలయాలు, నూతన కాలనీలు, గ్రీన్ బెల్డ్ స్థలాల్లో సుమారు లక్ష మొక్కలు నాటినందుకు గాను అటవీశాఖ ఉత్తమ పంచాయితీగా ఎంపిక చేసినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా సర్పంచ్ శారద మాట్లాడుతూ జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయితీగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో సమన్వయం చేసి తమతో మొక్కలు నాటించడం వల్లే నేడు మంచి ఫలితాలు అందుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News