ఢిల్లీ: మార్గదర్శి చందాదారులకు నోటీసులిచ్చి సాక్షిలో ప్రకటన ఇచ్చుకున్నారని ఎంపి రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఢిల్లీలోని ఎంపి రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చందాదారులకు నోటీసుల అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయని, మార్గదర్శి చందాదారులకు నోటీసుల అంశంపై తీర్పు రిజర్వులో ఉందని, ఈ వారంలో కోర్టు అదేశం వస్తుందని, చందాదారులకు నోటీసులు అంశంపై వైసిపి ప్రభుత్వం తప్పు చేసిందని ఎంపి ధ్వజమెత్తారు.
మార్గదర్శి అంశంలో ప్రభుత్వాన్ని కోర్టులు అనేక సార్లు తప్పు బట్టాయని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా రామోజీరావు నిజాలు రాయడం మానరని, నిజాలు రాస్తేనే పత్రికలకు ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని వివరించారు. నిజాలు రాసే పత్రికలను ప్రజలు కొంటారని, బలవంతంగా అంటగట్టే పత్రికలను ప్రజలు కొనరని, ఈనాడు పత్రికలో నాణ్యత కోసం పాఠకులు కొంటున్నారన్నారు. సిఐడి పనికిమాలినతనానికి, చిత్రహింసలకు తానే ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు.