Friday, December 20, 2024

వైఎస్సార్ సీపీకి రఘురామకృష్ణంరాజు రాజీనామా

- Advertisement -
- Advertisement -

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ కి ఆయన లేఖ పంపించారు. పార్లమెంట్ సభ్యత్వంనుంచి తనను అనర్హుడిగా చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకూ ఆశించిన  ఫలితాలను ఇవ్వలేదని పేర్కొంటూ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

రఘురామకృష్ణంరాజు చాలాకాలంగా అధిష్ఠానంపై అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన  త్వరలో తెలుగుదేశంపార్టీలో చేరతారని తెలుస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News