Wednesday, January 22, 2025

ఆ అగ్నిపర్వతాన్ని ముట్టుకుంటే మాడి మసి కాక తప్పదు: రఘువీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  కక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తోందని ఎపి కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం రఘువీర్ వీడియోలో మాట్లాడి ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనే నిప్పు కణికను తాకి మోడీ ఒళ్ళు కాల్చుకున్నారని చురకలంటించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లోకస లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, ప్రజల గొంతుక, రాహుల్ సూచనలు విని ప్రజలకు మేలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం పని చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని ఇడి, సిబిఐలతో కక్షపూరితంగా తాకే ప్రయత్నం చేస్తే మాడి మసికాక తప్పదని హెచ్చరించారు. ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ రాహుల్ గాంధీ పర్యటించి మనోధైర్యాన్ని ఇస్తున్నారని రఘువీర్ రెడ్డి ప్రశంసించారు. మణిపూర్ లో రెండు సార్లు పర్యటించి అక్కడి బాధితులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేరళలోని వయనాడ్ లో వరదలు బీభత్సం సృష్టించడంతో రాహుల్, ప్రియాంక గాంధీ అక్కడికి బాధితులను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు. రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే ప్రజలను ఇబ్బంది పెట్టినట్టేనని మోడీపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News