Wednesday, January 8, 2025

చలికాలంలో రాగులు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఆహార విషయంలో కూడా చలి నుంచి కాస్త బయట పడొచ్చు. వాటిలో రాగులు ఒకటి. దీని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాగి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు.. ఇది పోషకాల నిధి కూడా. ఇందులో పుష్కలంగా అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

 

చలికాలంలో రాగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. రాగుల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
2. రాగుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తింటే చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
3. రాగుల్లో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీనితో పాటు.. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది.
4. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతతో పోరాడడంలో కూడా చాలా సహాయపడుతుంది.
5. రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ అనేది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడే న్యూరోట్రాన్స్మిటర్.
5. రాగుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News