Sunday, January 19, 2025

రేవంత్‌కు నా ఉసురు తాకుతుంది: రాగిడి లక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

మొదటి విడత జాబితా వెలువడగానే హస్తం పార్టీలో అసంతృప్తుల సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆశావహుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. పలువురు రేవంత్‌తో పాటు పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు రేవంత్‌పై తిట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ నియోజకవర్గంలో టికెట్ ఆశించిన ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉప్పల్ టికెట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డికి కేటాయించడంతో బిబ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని, పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పని చేశానని రాగిడి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే మల్కాజిగిరి ఎంపిగా ఆహ్వానించి ఆయన్ను గెలిపించుకున్నామన్నారు. వత్తాసు పలికే వారికే రేవంత్ రెడ్డి టికెట్లు కేటాయిస్తున్నారని రాగిడి లకా్ష్మరెడ్డి మండిపడ్డారు. తన ఉసురు రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగులుతుందని ఆయన శపించారు. కాంగ్రెస్‌లో కార్యకర్తలకు న్యాయం జరగదని, 119 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని రాగిడి లక్ష్మారెడ్డి సంచలన కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News