Monday, December 23, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం: రాగిడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని బిఆర్‌ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి నివాసంలో మల్కాజ్‌గిరి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాగిడి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో అనుసరించే వ్యూహాలపై చర్చలు జరిపామన్నారు. కెసిఆర్ పాలనలోనే రాష్ట్రం అని విధాలుగా అభివృద్ధి చెందిందని, ప్రజల ఆశీర్వాదంతో మల్కాజ్‌గిరి ఎంపి స్థానాన్ని గెలుస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు.  బిఆర్ఎస్ నేతలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News