- Advertisement -
10 మంది సీనియర్ల సస్పెన్షన్
మనతెలంగాణ/హైదరాబాద్: మన మెడికల్ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన సంఘటనలో పది మంది వైద్య విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. ర్యాగింగ్‌కు గురైన బాధిత విద్యార్థులు కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ క మిటీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఢిల్లీలోని యుజిసి యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. యుజిసి ఆదేశాలతో విచారణ జరిపిన గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు ధ్రువీకరించారు. కమిటీ నివేదిక మేరకు జూనియర్లను ర్యా గింగ్ చేసిన 10 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేస్తూ గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) డా.రమేష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిఎంఇ హెచ్చరించారు.
- Advertisement -