Monday, January 13, 2025

రాగిణి నట విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

పలు భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న రాగిణి ద్వివేది నటిస్తున్న కొత్త చిత్రం ‘సారి’. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎం.డి ప్రొడక్షన్స్, కిస్ ఇంటర్నేషనల్స్ పతాకాలపై నిర్మాత నవీన్ కుమార్ (కెనడా) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో మూడవ షెడ్యూల్ మొదలు కానున్నది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయిక రాగిణి ద్వివేది, దర్శకుడు బ్రహ్మ, సహ నిర్మాత జై కృపాలిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అఫ్జల్ పాల్గొన్నారు. కథానాయిక రాగిణి ద్వివేది మాట్లాడుతూ “సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇంతకుమునుపు ఎన్నడు పోషించని సూపర్ హీరోగా ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నాను. నటించడానికి నాకెంతో స్కోప్ ఉన్న పాత్ర మాత్రమే కాదు నన్ను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది” అని అన్నారు. చిత్ర దర్శకుడు బ్రహ్మ మాట్లాడుతూ “మూడు భాషలలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో సూపర్ హీరోగా రాగిణి విశ్వరూపం చూడబోతున్నారు” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News