Sunday, December 22, 2024

ఇవాళ శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఏడో రోజు శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర మొదలైంది.  ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం ఆరాంఘర్ మీదుగా పురానాపూల్ వరకు చేరుకోనున్నారు. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకోనున్నారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో  ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో కాంగ్రెస్ నేతలతో మీటింగ్ ఉంటుంది. అనంతరం బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ బస చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News