Saturday, December 21, 2024

కేరళ చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

వాయనాడ్: కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య గురవారం  వరకు 276కు చేరింది. కాగా గాయపడిన వారి సంఖ్య 200 కు చేరింది. వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి కొండ ప్రాంతంలో విధ్వంసం తీవ్రంగా ఉంది. దాదాపు 240 మంది గల్లంతయ్యారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్రువీకరించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి 1500 మందికి పైగా జనులను కాపాడారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేడు కేరళలో బాధితులను పరామర్శించేందుకు కన్నూర్ విమానాశ్రయం చేరుకున్నారు. వారు వివిధ రిలీఫ్  క్యాంపుల్లో, మెడికల్ కాలేజీల్లో ఉన్న బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

మనోరమ పత్రిక కథనం ప్రకారం భారత సేన బెయిలీ బ్రిడ్జిని ముండక్కై లో హుటాహుటిన నిర్మించి సహాయక చర్యలు చేపట్టింది. వాయనాడ్ లో దాదాపు 45 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇల్లు కోల్పోయి నిర్వాసితులైన 3000 మందికి ఈ క్యాంపులు ఆశ్రయం కల్పిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News