Tuesday, January 21, 2025

సంత్ రవిదాస్ ఆలయంలో రాహుల్, ప్రియాంక పూజలు

- Advertisement -
- Advertisement -

Rahul and Priyanka worship at Sant Ravidas Temple

వారణాసి: సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ఇక్కడి గురు రవిదాస్ మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. 15-16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లంగర్ సేవలో వారు పాల్గొన్నారు. ఉదయం బాబట్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్, ప్రియాంకలకు మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌తోసహా స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. వారు అక్కడ నుంచి నగరంలోని గురు రవిదాస్ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి గురు రవిదాస్ చిత్రపటాలను, సావనీర్లను అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News