వారణాసి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 7న జరగనున్నాయి. చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వారణాసి విమానాశ్రయం చేరుకున్న రాహుల్, ప్రియాంక అక్కడ నుంచి నేరుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని మందిరానికి చేరుకున్నారు. దర్శనానంతరం వారిద్దరూ పిండర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం బయల్దేరి వెళ్లారు. పిండర అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. కాగా.. రాహుల్, ప్రియాంక సందర్శనకు ముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని కాశీ విశ్వనాథుని మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
కాశీ విశ్వనాథునికి రాహుల్, ప్రియాంక పూజలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -