Wednesday, January 22, 2025

అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల వర్క్ లోడ్ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ తల్లిదండ్రులను లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ  పరామర్శించారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో అన్నా సెబాస్టియన్ పనిచేస్తుండేది. మంచి టాలెంట్ అయిన మహిళ. విపరీతంగా పనిచేయించి ఆమె సంస్థ ఆమె ప్రాణాలు పోయేలా చేసింది.

కొచ్చిలో ఉన్న అన్నా తల్లిదండ్రులకు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో పని పరిస్థితులు మెరుగుపడ్డానికి పోరాడతానని హామీ ఇచ్చారు. విచారకర సమయంలో కూడా వారి కుటుంబం నిస్వార్థంగా పనిచేసే వారందరి శ్రేయస్సు కోసం గళమెత్తడాన్ని మెచ్చుకున్నారు. భారత దేశంలో వర్క్ కల్చర్ ఎలా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. పని గంటలు, సెలవులు, ఇతర సదుపాయాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. కొందరు పని దొంగలుంటే, చాలా మందికి నడుములు విరిగిపోయేంత పని ఉంటుంది. వర్క్ స్ట్రెస్, టాక్సిక్ కల్చర్ రాజ్యమేలుతోంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపిసి) చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి  వెళ్లి అన్నా తల్లిదండ్రులను పరామర్శించారు.

ఇదిలావుండగా ‘‘పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతా. పని ప్రదేశాల్లో అందరికీ ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండేలా చూస్తా. అది ప్రయివేట్ రంగమైనా సరే, ప్రభుత్వ రంగమైనా సరే. ఎక్కడైనా రోజుకు ఎనిమిది గంటలకు మించి పనిచేయనివ్వకుండా చూస్తా. పనిచేసే ప్రదేశంలో అమానుషాన్ని రూపుమాపేందుకు చాలా తీవ్రమైన శిక్షలు పడేలా చూస్తా. పనిప్రదేశాల్లో మానవ హక్కులు మంటగలవకుండా చూస్తా’’ అని కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అన్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News