Monday, December 23, 2024

రాహుల్ బజాజ్ (83) కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Rahul bajaj passed away

 

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) శనివారం కన్నుమూశారు. మహారాష్ట్రలోని పుణేలో ఆయన తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ప్రకటించింది. 1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను రాహుల్ స్వీకరించారు. 2005లో విధుల నుంచి తప్పుకున్న వెంటనే ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రాహుల్‌ను పద్మ భూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభలో ఎంపిగా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News