Monday, December 23, 2024

నేటి నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది. నిరుద్యోగిత, ధ రల పెరుగుదల, సామాజిక న్యా యం వంటి సమస్యలపై ప్రధానం గా దృష్టి సారిస్తూ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ యాత్రకు ఉపక్రమించడం పార్టీ యత్నం. భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాలలో 100 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా సాగించిన యాత్ర మాదిరిగా ఇది ‘పరివర్తన’ యాత్రగా భాసిస్తుందని పార్టీ విశ్వసిస్తున్నది. పార్లమెంట్‌లో ప్రజల సమస్యల ప్రస్తావనకు ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వనందున భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఉపక్రమిస్తున్నామని కాంగ్రెస్ వివరించింది. రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సిద్ధాంతాలను తిరిగి నెలకొల్పడం తమ యాత్ర లక్షమని పార్టీ తెలియజేసింది. ఇది ఎన్నికల యాత్ర కాదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తమ పేలవ ప్రదర్శన దరిమిలా తమ భవిష్యత్తు మెరుగుదలను కోరుతున్నామని పార్టీ స్పష్టం చేసింది. ఈ నెల 22 నాటి రామ మందిరం ప్రతిష్ఠాపనపై బిజెపి దృష్టి కేంద్రీకరిస్తుండడంతో ఈ యాత్ర ద్వారా జీవనోపాధి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది.

మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల ‘అన్యాయ్ కాల్’పై యాత్ర
భారత్ జోడో న్యాయ్ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఎన్నికల్లో వోట్ల సముపార్జన కోసం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల ‘అన్యాయ్ కాల్’కు వ్యతిరేకంగా యాత్ర చేపడుతున్నామని పార్టీ తెలిపింది.
ఆర్థిక అసమానతలు, రాజకీయ నియంతృత్వాన్ని విశ్వసించే సిద్ధాంతమే ఇప్పుడు దేశం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. రమేష్ ఇంఫాల్‌లో విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ, ప్రధాని ‘అమృత్ కాల్’ గురించి బంగారు కలలు కంటున్నారని, కానీ గడచిన పది సంవత్సరాల వాస్తవం ఏమిటంటే ‘అన్యాయ్ కాల్’ అని పేర్కొన్నారు. ‘అమృత్‌కాల్’ గురించి గొప్ప గా చెప్పుకుంటుండగా ‘అన్యాయ్ కాల్’ గురించిన ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కీషమ్ మేఘచంద్ర సింగ్, సిడబ్లుసి సభ్యుడు గైఖంగమ్ హాజరైన ఈ గోష్ఠిలో రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News