Monday, December 23, 2024

నేటి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర

- Advertisement -
- Advertisement -

కన్యాకుమారినుంచి
కశ్మీర్ దాకా పాదయాత్ర
150 రోజులు..3,750 కి.మీ
సాగనున్న యాత్ర
13 రాష్ట్రాలు, రెండు కేంద్ర
పాలిత ప్రాంతాల మీదుగా..
22 నగరాల్లో భారీ
బహిరంగ సభలు

నేడే రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర
కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర
150 రోజులు..3,750 కి.మీ సాగనున్న యాత్ర
13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా..
22 నగరాల్లో భారీ బహిరంగ సభలు

కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు అందించి 2024 లోక్‌సభ ఎన్నికలనాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి గట్టి సవాలు విసిరేందుకు ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారినుంచి కశ్మీర్ వరకు 3,750 కిలోమీటర్ల మేర ఈ పాయాత్ర సాగ్తుంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర 150 రోజుల పాటుజరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ కన్యాకుమారిలో రాహుల్‌గాంధీకి ఖాదీ త్రివర్ణ పతాకాన్ని అందించడంతో యాత్ర మొదలవుతుంది. గాంధీ మండపంనుంచి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు పాదయాత్రగా సాగి బహిరంగ సభ జరిగే వేదిక వద్దకు చేరుకుంటారు. దీనికి ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ స్మారక స్థలి వద్ద జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ విగ్రహం, కామరాజ్ మెమోరియల్‌ను కూడా రాహుల్ సందర్శిస్తారు.

ప్రియాంక పిలుపు

కాగా ఎక్కడ వీలయితే అక్కడ ఈ యాత్రలో పాలు పంచుకోవలసిందిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఒక వీడియో సందేశంలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో నెగెటివ్ రాజకీయాలు చేస్తున్నందున, ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలను చర్చించనందున ఈ యాత్రను చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆమె ఆ వీడియోలో అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అసలైన ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టేలా చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ప్రియాంక అన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 19 నాటికి జరగాల్సి ఉంది. ఈ తరుణంలో భారత్ జోడో యాత్ర ప్రాంభమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేనప్పటికీ ఆయనకు నచ్చజెప్పేందుకు పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది వీలు కాకపోతే గాంధీయేతర కుటుంబంనుంచి అధ్యక్షుడు ఎన్నికవుతారు.

జనవరి 30తో ముగింపు

కాగా భారత్ జోడో యాత్ర మహాత్మాగాంధీ వర్ధంతిరోజైన జనవరి 30తో ముగుస్తుంది. మొత్తం ఈ యాత్రలో పార్టీకి చెందిన 119 మంది నేతలు , పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల్లో వీరంతా కలుస్తారు. యాత్ర సందర్భంగా 22 నగరాలు, పట్టణాల్లో బారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. తిరువనంతపురం, కొచ్చి, నీలాంబుర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జలగావ్, ఇండోర్, కోటా, దౌసా, అల్వార్, బులంద్‌శహర్, ఢిల్లీ, అంబాల, పఠాన్‌కోట్, జమ్మూ శ్రీనగర్‌లలో ఈ ర్యాలీలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో భారత్‌కే రతన్( లోకల్ చాంపియన్స్‌తో సమావేశాలు), సంవిధాన్ బచావో( రాజ్యాంగ పరిరక్షణ) యాత్రలకు కూడా కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. యాత్ర మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో నూ పాదయాత్రలకు పార్టీ ప్రణాళికలు రూపొందించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News