- Advertisement -
శ్రీనగర్ : ఉగ్రవాదుల తూటాలకు బలైన ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ హత్యకు నిరసనగా కశ్మీర్ పండిట్లు శనివారం శ్రీనగర్‌లో ప్రదర్శన నిర్వహించారు. లాల్‌చౌక్‌లో ప్రసిద్ధి చెందిన క్లాక్‌టవర్ వద్ద ధర్నా చేశారు. హత్య కావింపబడిన భట్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 35 ఏళ్ల రాహుల్ భట్ వలసదారులకు కల్పించిన స్పెషల్ ఎంప్లాయ్‌మెంట్ ప్యాకేజి కింద క్లర్కు ఉద్యోగం పొందగలిగారు. చదూరా పట్టణం లోని తహశీల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తుండగా మే 12 న ఉగ్రవాదులు కాల్చి చంపారు. నగరం లోని లాల్‌మండీ ఏరియాలో బండ్ వద్ద మొదట కశ్మీర్ పండిట్లు సమావేశమై జీలం నది వద్ద భట్ పేరున పూజలు చేశారు. తరువాత నిరసన ప్రదర్శన చేపట్టారు.
- Advertisement -