- Advertisement -
రాహుల్ సరికొత్త ట్వీటు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం అధికార బిజెపి చెప్పుచేతల్లో నడుస్తోందని, అక్రమాల గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే తమ నిరసనను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఈసారి వినూత్నంగా వ్యక్తం చేశారు. కేవలం రెండే రెండు ఆంగ్ల పదాలతో ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. ఎలక్షన్ ‘కమిషన్’ అని వ్యాఖ్యానించారు. అసోంలో ఇవిఎంలు బిజెపి అభ్యర్థి కారు ఢిక్కీలో పోతాయి. పట్టించుకోరు. ప్రతిపక్ష నేతల ప్రచారంపై గడువు వరకూ నిషేధం విధిస్తారు. ఇదే సమయంలో బిజెపి నేతలపై ప్రచార నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తారు. ఇది సరైనదేనా అని అడిగితే పట్టించుకోరు. వీటిని బట్టి చూస్తే ఈ ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఎలక్షన్ ‘కమిషన్’ అని పేర్కొనాలనిపిస్తోందని రాహుల్ ట్వీట్ వెలువరించారు.
- Advertisement -