- Advertisement -
న్యూఢిల్లీ : చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి ప్రశాంతి ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యానించారు. మన వీర జవాన్ల త్యాగాలను విస్మరించి మన భూభాగాన్ని ప్రభుత్వం ఎందుకు కోల్పోతోంది? అని ఆయన ట్విటర్‌లో లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. తూర్పు లడఖ్ వద్ద పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ గట్ల వద్ద సైన్యాలను ఉపసంహరించడానికి భారత్, చైనా ఒప్పందానికి వచ్చాయని రాజ్యసభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటించిన తరువాత రాహుల్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం వల్ల తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఇదివరకటి పరిస్థితి నెలకొంటుందని రాజ్‌నాధ్ వివరించారు.
- Advertisement -