Monday, January 20, 2025

రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకున్న మణిపూర్ పోలీసులు(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను గురువారం ఇంఫాల్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద మణిపూర్ పోలీసులు నిలిపివేశారు. విమానంలో ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ సహాయక శిబిరాలలో తలదాచుకున్న నిరాశ్రయులను కలుసుకనేందుకు రోడ్డు మార్గంలో చైరచంద్‌పూర్ వెళుతుండగా పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

రాహుల్ ప్రయాణిస్తున్న మార్గంలో హింసాకాండ చోటుచేసుకుంటుందన్న భయంతోనే కాన్వాయ్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలో ఉట్లో గ్రామం సమీపంలో హైవేపై ఆందోళనకారులు టైర్లు తగలబెట్టారని, కాన్వాయ్‌పై రాళ్లు కూడా రువ్వారని పోలీసులు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతాయన్న భయంతోనే ముందు జాగ్రత్తగా బుష్ణుపూర్ వద్ద కాన్వాయ్‌ను ఆపాలని తాము అభ్యర్థించామని ఒక పోలీసు అధికారి తెలిపారు.

కాగా, తమ నాయకుడు సురక్షితంగా ముందుకు సాగేందుకు వీలుకల్పించాలని కోరుతూ పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులతో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News