- Advertisement -
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ శుక్రవారం డిమాండ్ చేశారు.
కుల గణన చేపట్టాలన్న ఇమాండు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం దీన్ని అమలుచేయడం లేదని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలియచేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని, అయితే దీని అమలుకు కులాల వారీగా జనాభా గణన, నియోజవకర్గాల పునర్విభజనతో ప్రభుత్వం ముడిపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అమలుకు అడ్డంకులుగా చెబుతున్న రెండు కారణాలు కుంటిసాకులని ఆయన విమర్శించారు. అమలులోకి తీసుకురాకుండానే దీన్ని ఓ ఎన్నికల అంశంగా వాడుకోవాలన్నది బిజెపి ఎత్తుగడని ఆయన ఆరోపించారు.
- Advertisement -