Sunday, December 22, 2024

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేయాలి : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్‌ను అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని, కులగణన వంటి డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగం గానే కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ దీని అమలును జనగణన, డీలిమిటేషన్‌తో కేంద్రం ముడిపెట్టిందని , పదేళ్ల తరువాత అమలవుతుందని కేంద్రం చెబుతోందని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో విమర్శించారు. మహిళా కోటాను వాయిదా వేసేందుకే డీలిమిటేషన్, జనాభా లెక్కల వంటి కుంటిసాకులు చెబుతోందని బీజేపీ ప్రభుత్వంపై ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది. ఇది కేవలం “ఆటపట్టించే భమ”గా వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News