Sunday, December 22, 2024

రాహుల్ హిందూత్వను అవమానించలేదు: ఉద్ధవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

ముంబై:బిజెపిని లక్షంగా చేసుకుని సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రాహుల్ ఎక్కడా హిందూమతాన్ని అవమానించేలా విమర్శలు చేయలేదని, శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రే మంగళవారం వెల్లడించారు.

“పార్లమెంట్‌లో రాహుల్ ప్రసంగాన్ని విన్నాను. మాలో ఎవరూ హిందుత్వను అవమానించరు. దాన్ని మేం సహించేది లేదు. ఇది రాహుల్‌కు కూడా వర్తిస్తుంది. బీజేపీ మాత్రమే హిందుత్వకాదు. నేను బీజేపీని నిషేధిస్తాను. హిందుత్వను కాదు” అని థాక్రే వివరించారు. విపక్షనేతగా రాహుల్ పార్లమెంట్‌లో సోమవారం చేసిన తొలి ప్రసంగంలో బీజేపీపై అడ్డూఆపూలేని విమర్శల దాడి చేశారు. మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నారని బీజేపీ నాయకులపై దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News