Tuesday, December 24, 2024

రాహుల్ హిందుత్వాన్ని అవమానించలేదు: ఉద్ధవ్ థాకరే

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్ష నేత.. పార్లమెంటులో తన ప్రసంగంలో హిందుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని థాకరే అన్నారు.

ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందుత్వాన్ని అవమానించలేదని పేర్కొంటూ శివసేన (యూబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం సమర్థించారు.  బిజెపిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం దుమారం రేపిందన్నది తెలిసిన విషయమే.

“రాహుల్ గాంధీ ప్రసంగం నేను విన్నాను. మేమేమీ హిందుత్వాన్ని అవమానించము , దానిని సహించము. ఇందులో రాహుల్ జీ కూడా ఉన్నారు. రాహుల్ జీ బిజెపి హిందుత్వ కాదని అన్నారు. నేను బిజెపిని వదిలిపెట్టాను, హిందుత్వాన్ని కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు” అని థాకరే తెలిపారు.

“ఆయన (గాంధీ) శివుడి ఫోటోను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది కూడా నిషేధించబడింది. ఇది హిందుత్వమా? రాహుల్ జీ హిందుత్వాన్ని అవమానించాడని నేను అనుకోను. మన హిందుత్వం పవిత్రమైనది” అన్నారు థాక్రే.

Rahul Gandhi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News