Sunday, January 19, 2025

జట్టులో సమతౌల్యం లోపించింది: రాహుల్ ద్రవిడ్

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌట్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టులో సమతౌల్యం లోపించిందని అంగీకరించాడు. ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నాడు. ఇక సిరీస్ ఓటమికి సమష్టి వైఫల్యం కారణమన్నాడు. దీనికి కెప్టెన్ రాహుల్ ఒక్కడినే బాధ్యుడ్ని చేయడం మంచిది కాదన్నాడు. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన రాహుల్‌పై ఎలాంటి ప్రభావం ఉండదన్నాడు. అతనిలో అపార నాయకత్వ ప్రతిభ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో మంచి కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు అతనిలో అధికంగా ఉన్నాయని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.

Rahul Dravid about India losing ODI Series against SA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News