Sunday, November 17, 2024

ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి: రాహుల్ ద్రావిడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ భారత జట్టు విజృంభించడంతో టీమిండియా 4-1 తేడాతో ఈ సిరీస్‌లో విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెరో రెండు శతకాలతో చెలరేగారు. ఈ సిరీస్‌లో జైస్వాల్ అత్యధిక పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. యువ బ్యాట్స్‌మెన్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి జట్టు విజయంలో భాగమయ్యారు. ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ కు భారత జట్టు సరైన సమాధానం చెప్పిందని క్రికెట్ పండితులు ప్రశంసిస్తున్నారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్‌లో రాణించారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడారు. యువ జట్టుతో కలిసి పని చేయడంతో సంతోషంగా ఉందని చెప్పారు. అశ్విన్‌కు ఆటపై ఉన్న కమిట్‌మెంట్‌ను తక్కువ చేయకూడదని, తన తల్లికి అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లి.. ఒక్క రోజులోనే తిరిగి వచ్చారని ప్రశంసించారు. కోచ్‌కు ఆటగాళ్ల మధ్య మంచి వాతావరణం ఉండేటా చూడటం తన బాధ్యత అని, కెప్టెన్ రోహిత్‌తో కలిసి పని చేయడంతో పాటు తుది జట్టును ఎంపిక చేస్తామని ద్రావిడ్ వివరించారు. ఎవరు బాగా ఆడతారు?.. ఎవరు ఆడలేరనే విషయాలు మందుగా తమకు తెలియదన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు నిరాశపరచలేదని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News