Sunday, January 19, 2025

రాహుల్ ద్రవిడ్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Rahul Dravid tests Covid-19 positive

ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ఆరంభానికి ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఇది టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ లేకుండానే భారత జట్టు ఆసియాకప్ కోసం యూఎఇ బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొంది. టీమిండియా మంగళవారం యూఎఇకి బయలుదేరింది. ఈ క్రమంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో రాహుల్ జట్టుతో యూఎఇకి వెళ్లలేదు. అయితే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ నాటికి ద్రవిడ్ దుబాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News