Sunday, January 19, 2025

ద్రవిడ్ టీమ్‌కు విశ్రాంతి?

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐర్లాండ్‌తో ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్ టి20 సిరీస్‌కు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బృందానికి విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలిసింది. రానున్న సుదీర్ఘ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్ పర్యాటనలో ద్రవిడ్‌తో పాటు అతని సహాయక బృందానికి విశ్రాంతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయిచింనట్టు తెలిసింది. ఆగస్టులో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టు మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను కూడా దూరంగా ఉంచాలని బిసిసిఐ భావిస్తున్నట్టు సమాచారం. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ పాండ్య సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో కూడిన బృందాన్ని సిరీస్‌కు పంపించాలని బిసిసిఐ భావిస్తోంది. అంతేగాక ప్రధాన కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయనున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News