Wednesday, January 22, 2025

రాజకీయ నేతగా రాహుల్‌లో పరివక్వత: అమర్తసేన్

- Advertisement -
- Advertisement -

బోల్‌పూర్(ప.బెంగాల్): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గత కొద్ది సంవత్సరాలలో గణనీయమైన పరిపక్వతతను సాధించారని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త సేన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ హయాంలో లోక్‌సభలో ప్రతిపక్షానికి ఎలా సారథ్యం వహించారన్నదే రాహుల్‌కు అసలైన పరీక్షని ఆయన తెలిపారు. రాహుల్ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఆయనను జాతీయ నాయకుడిగా మలచడమేకాక ఆయనలో రాజకీయ అవగాహనను పెంపొందించిందని సేన్ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లా బోల్‌పూర్‌లోని తన పూర్వీకుల నివాసంలో అమర్తసేన్ పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో రాహుల్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో తాను ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాలంలో విద్యార్థిగా రాహుల్ గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ తన జీవిత గమ్యం ఏమిటో అప్పట్లో రాహుల్‌కు స్పష్టత లేదని, రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉండేది కాదని సేన్ తెలిపారు.

రాజకీయాలలో ప్రవేశించిన తొలి నాళ్లలో యువ నాయకుడిగా రాహుల్ కొంత ఇబ్బందిని ఎదుర్కొని ఉండవచ్చని, అయితే కాలం గడిచేకొద్దీ తనను తాను తీర్చిదిద్దుకున్నాడని, ఇటీవల ఆయన చూపించిన పనితీరు ఆద్భుతమని సేన్ ప్రశింసించారు. వాస్తవానికి రాహుల్ పనితీరుకు తాను ముగ్ధుడినయ్యానని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం ఆధారంగానే ఎన్నికల్లో పోరాడలేడని, దేశం ఏం కోరుకుంటుందో కూడా ఫలితాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ తదుపరి ప్రధానిగా రాహుల్‌ను మీరు చూస్తున్నారా అన్న ప్రశ్నకు ఇటువంటి విషయాలను అంచనా వేయడం చాలా కష్టమని ఆయన అన్నారు. నేను ఢిల్లీలో విద్యార్థిగా ఉన్న కాలంలో మీ తోటి విద్యార్థులలో ప్రధానిగా ఎవరు అయ్యే అవకాశం లేదని ఎవరైనా అడిగితే మన్మోహన్ సింగ్ పేరు చెప్పేవాడిని. ఎందుకంటే ఆయనకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు.

అయితే ఆ తర్వాత ఆయనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి విషయాలను అంచనా వేయడం చాలా కష్టం అని సేన్ చెప్పారు. రాహుల్ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఆయనకే కాక భారత్‌కు కూడా ఎంతో మేలు చేసిందని సేన్ తెలిపారు. భారత్‌లోని అసమానతలు, మత వివక్ష వంటి సమస్యలపై రాహుల్ దృష్టి సారించం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు, అల్పసంఖ్యాక వర్గాలైన ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల పట్ల పెరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టుకుని రాహుల్ ఎలా పోరాడతారన్నదే కీలక అంశమని, ఈ విషయంలో రాహుల్ నిర్వహిస్తున్న పాత్ర సరైన దారిలోనే వెళుతోందని తాను భావిస్తున్నానని సేన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News