Sunday, January 12, 2025

కేరళలో రాహుల్ పాదయాత్రకు అపూర్వ ఆదరణ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో రెండవ రోజుకు ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీరుకు రాహుల్ గాంధీ చేపట్టిన 3,500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు కేరళలో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్ గాంధీకి మద్దతుగా వేలాదిమంది ప్రజలు తిరువనంతపురంలోని వీధులలో బారులు తీరారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల 150 రోజుల పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాహుల్ ఇక్కడి వెల్లయాని జంక్షన్ నుంచి తన యాత్ర ప్రారంభించారు. భారత్‌కు, యువతరానికి మంచిరోజు రేపు రానున్నదని ప్రతి ఉదయం తనలో కొత్త ఆశ, నమ్మకం చిగురిస్తోందని రాహుల్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భారత్ కోసం ప్రతిఒక్కరూ, భారత్ కోసం ప్రతి అడుగు అంటూ ఆయన పేర్కొన్నారు. రాహుల్ పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతోపాటు ఆయన యాత్రను చూసేందుకు రోడ్డుకిరువైపులా వేలాదిమంది బారులు తీరి నిలబడుతున్నారు. భారత్ జోడో యాత్ర 5వ రోజు యథాప్రకారం ఉదయం 7 గంటలకు తిరువనంతపురం శివార్లలోని వెల్లయాని జంక్షన్ నుంచి ప్రారంభమైందని, కేరళ రాజధాని నగరంలోపల సుమారు 11 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

Rahul Gandhi 2nd day Pada Yatra in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News