Tuesday, January 21, 2025

రాహుల్ గాంధీ ఓ విదూషకుడు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఆనంద్: రాహుల్ గాంధీని సూటిగా ఎదుర్కోలేక మళ్లీ కించపరిచే టాక్టిస్‌కు దిగుతున్నారు బిజెపి నాయకులు. ‘రాహుల్ గాంధీ ఓ విదూషకుడని లోకానికంతా తెలుసు. ప్రధాని మోడీ పర్సనాలిటీని ఆయన సమగ్రంగా అర్థం చేసుకోలేరు.’ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం అన్నారు. ప్రధాని మోడీని ఇటీవల రాహుల్ గాంధీ విమర్శించినందుకు ఆయన ఈ రీతిగా వ్యాఖ్యానించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో గిరిరాజ్ సింగ్ గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన గుజరాత్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్‌లో(ఐఆర్‌ఎంఎ)లో 42వ స్నాతకోత్సవంలో ప్రసంగించాక మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని చులకన చేస్తూ మాట్లాడారు.

విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడి శాంటా క్లారాలో భారతీయులతో మాట్లాడుతూ ‘ ఇండియాలో కొంత మంది ఉన్నారు. వారు దేవుడికన్నా ఎక్కువ తెలుసనుకుంటారు. అలాంటి వారిలో ప్రధాని మోడీ ఒకరు. ఒకవేళ మీరు మోడీని దేవుడి ముందు కూర్చోబెడితే, ఆయన దేవుడికే ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తారు. అప్పుడు దేవుడు కూడా నేనెలాంటి వాడిని సృష్టించాను అని అయోమయానికి గురవుతాడు’ అన్నారు.

దీనిపై మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీకి తానేమంటున్నది కూడా తెలియడంలేదు’ అన్నారు. ‘ఆయన హాస్యగాడని(విదూషకుడు) అని యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన నాన్నమ్మ(ఇందిరా గాంధీ) ఒకప్పుడు పార్లమెంటులో భారత ప్రధాని విదేశీగడ్డపై నుంచే యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఇప్పుడు ఆమె మనవడు విదేశీ పర్యటనలో ఉండి భారత దేశంపై ఆశలు రేపుతున్నారు’ అన్నారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనను గిరిరాజ్ సింగ్ ‘గాలీ యాత్ర’(తిట్ల యాత్ర) అన్నారు. ప్రపంచమంతా మోడీకి గౌరవం ఇస్తోందన్నారు. చైనా, పాకిస్థాన్ నేతలను కూడా దూరంపెడుతోంది, భారత ప్రధానితో చేతులు కలపడానికి ఇష్టపడుతున్నాయన్నారు. ‘మోడీని విమర్శించేప్పుడు రాహుల్ గాంధీ దేవుడిని తలచుకున్నారు. మోడీ పర్సనాలిటి  ఆయన అవగాహనకు సాధ్యం కానిది’ అన్నారు. ‘బిజెపి ఎప్పుడూ హిందూ-ముస్లిం రాజకీయాలను నమ్మదు. మేము అభివృద్ధికర రాజకీయాలనే కోరుకుంటాము. మోడీ నేతృత్వంలో గత తొమ్మిదేళ్లలో దేశం ఎంత బాగా అభివృద్ధి చెందిందో. వ్యక్తిగతంగా నేను సనాతులు తగ్గిపోతే, భారత ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుందని నమ్ముతాను’ అన్నారు సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News