Monday, December 23, 2024

రాహుల్ గాంధీ ఓ యోధుడు!

- Advertisement -
- Advertisement -
కీర్తించిన ప్రియాంక గాంధీ

ఘాజియాబాద్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ ‘ఓ యోధుడు’ అని, ప్రభుత్వ బలానికి భయపడే వ్యక్తి కాదని అన్నది. అతడి ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ప్రభుత్వం ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరిన భారత్ జోడో యాత్రను లోనీ సరిహద్దు వద్ద ఆమె స్వాగతించారు. ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా ఒకింత ఆవేశంగా ‘పెద్ద పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు రాజకీయవేత్తలను, పబ్లిక్ సెక్టార్ యూనిట్లను, మీడియాను కొనగలరేమో కానీ, నా సోదరుడిని మాత్రం ఎన్నటికీ కొనలేరు’ అన్నారు. రాహుల్ గాంధీకి చలివేయడంలేదని ప్రజలు అంటున్నారు… కానీ ‘ఆయన సత్యం అనే కవచం ధరించారు’ అని ఆమె పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ తన యాత్రలో, ఢిల్లీలోని చలిలో కూడా తెల్ల టి-షర్టునే ధరించి నడుస్తున్నారు. దానికి రాజకీయవేత్తలు, మీడియా వాళ్లు అంతా ‘ఆయనకు చలివేయడం లేదా?’ అని అవాక్కవుతున్నారన్నారు. కన్యాకుమారి నుంచి 3000 కిమీ. ప్రయాణించిన ఈ యాత్రను తాను సగర్వంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ఆహ్వానిస్తున్నానని ప్రియాంక గాంధీ అన్నారు. “నా అన్నను చూడండి, ప్రభుత్వ యంత్రాంగం ఆయనపై ఎంతో ఒత్తిడి పెంచింది. అతడి ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఎన్నో వేలు ఖర్చు చేసింది. కానీ ఆయన తన సత్య బాటను వదలలేదు. అనేక ప్రభుత్వ సంస్థలను(ఏజెన్సీలను) మోహరించారు. ఆయన వెరువలేదు. ఆయన ఓ యోధుడు’ అన్నారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు ఈ ‘మొహబ్బత్ కీ దుకాణ్’ తెరవాలని కోరుతున్నాను’ అని ప్రియాంక గాంధీ యూపీ ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News