Saturday, January 11, 2025

రాహుల్ గాంధీ.. ఎప్పుడూ తెల్ల టీషర్ట్ వేసుకుంటారు.. ఎందుకో తెలుసా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ తెల్ల టీషర్ట్ ఎందుకు ధరిస్తారు? అందుకు ఆయన రెండు కారణాలు చెప్పారు. అది ‘పారదర్శకత’ను, ‘సరళత’ను సూచిస్తుంటాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా చానళ్లలో విడుదల చేసిన రెండు నిమిషాలపైగా నిడివి గల వీడియోలో అటువంటి మృదు ప్రశ్నలు పెక్కింటికి రాహుల్ సమాధానం ఇచ్చారు.

సిద్ధాంతం ప్రాధాన్యం గురించి కూడా రాహుల్ ఆ వీడియోలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘నా అభిప్రాయంలో సిద్ధాంతంపై విస్పష్ట అవగాహన లేకుండా అధికారం దిశగా ఒక పెద్ద సంస్థగా మీరు వెళ్లజాలరను. పేదల అనుకూల, మహిళల అనుకూల, బహుళ విధ, ప్రతి ఒక్కరినీ సమానంగా పరిగణించాలన్న మన విధానం గురించి ప్రజలను మనం నమ్మించవలసి ఉంటుంది’ అని ఆయన అన్నారు. ‘అందువల్ల సంస్థాగత స్థాయిలో, జాతీయ స్థాయిలో పోరాటం సదా సిద్ధాంతం గురించే’ అని రాహుల్ స్పష్టం చేశారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ భారత్ జోడో యాత్ర వరకు రాహుల్ గాంధీ ‘ట్రేడ్‌మార్క్’ తెల్ల టీషర్ట్. దానినే ఎల్లప్పుడూ ఎందుకు ధరిస్తుంటారని ప్రశ్నించినప్పుడు ‘పారదర్శకత, సరళత. దుస్తుల గురించి నేను అంతగా పట్టించుకోను. తేలికగా ఉండేవి ఇష్టపడతా’ అని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రచారంలో శ్రేష్టమైనది ఏది అని ప్రశ్నించినప్పుడు ‘అది ముగిసినప్పుడు’ అని ఆయన జవాబు చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర నుంచి తాను 70 రోజుల పాటు రోడ్డుపైనే ఉన్నానని రాహుల్ తెలిపారు. అయితే, అది ప్రచారం కాదని, కానీ మరింత కఠిన శ్రమతో కూడుకున్నదని ఆయన వివరించారు. ప్రచారంలో ఉపన్యాసాలు ఇవ్వడాన్ని ఇష్టపడతానని, అది ‘దేశానికి ఏమి కావాలో జనాన్ని ఆలోచింపజేస్తుంది’ అని రాహుల్ వీడియోలో చెప్పారు.

ప్రచారంలో దేనిని ఇష్టపడతారని, ఇష్టపడరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా రాహుల్ వీడియోలో అడిగారు. ‘చెడ్డదనేది ఏదీ లేదు. మనం దేశం కోసం ఇది చేస్తున్నందున ఇది మంచిది. దేశాన్ని చెడగొడుతున్నవానిని ఆపేందుకు మనం కృషి చేసినప్పుడు బాగుందని మనం అనుకుంటాం. కనీసం దేశం కోసం ఏదో చేస్తున్నాం’ అని ఖర్గే చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వీడియోలో కనిపించారు. ఆయన సిద్ధాంతం ప్రాముఖ్యం గురించి ఆయన మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News