Sunday, January 19, 2025

లోక్ సభలో బిజెపీ, మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

- Advertisement -
- Advertisement -

లోక్ సభలో బిజెపి, ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపి, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని మెడీ వెళ్లలేదని.. అక్కడ తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని చెప్పారు. మణిపూర్ ను బిజెపి పట్టించుకోవడం లేదని.. మోడీ ఒక్కసారి మణిపూర్ వెళ్లండని రాహుల్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదని. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన నీట్‌ ను కమర్షియల్‌గా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ కీలక పాయింట్స్:

  • రామజన్మభూమి బిజెపిది కాదని ప్రజలు మెసేజ్ ఇచ్చారు
  • అయోధ్య ప్రజలను మందిరం దగ్గరకు కూడా రానివ్వలేదు
  • అయోధ్య ఎయిర్ పోర్టు కోసం ప్రజల భూములు లాక్కుకున్నారు.
  • అయెధ్య మందిరం ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందించారు
  • అదానీ ఆదేశాల మేరకు మోడీ పనిచేస్తారు
  • వ్యాపారవేత్తలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు.. రైతులకు కూడా మాఫీ చేయొచ్చు కదా?
  • రైతులను భయపెట్టి నల్ల చట్టాలు తెచ్చారు.
  • 700మంది రైతులు చనిపోయారు
  • బిజెపి హిందువులకు వ్యతిరేకం
  • బిజెపి జమ్మూకాశ్మీర్ ను మూడు ముక్కలు చేసింది
  • బీజేపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి
  • బిజెపి ఆధేశాలతో సీబిఐ, ఇడీ.. ప్రతిక్షాలను వేధిస్తున్నాయి
  • తప్పుడు కేసులతో విపక్ష నేతలను జైల్లో పెడుతున్నారు
  • నా ఎంపి పదవి, ఇంటిని లాక్కుకున్నారు
  • ఇడి నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నారు
  • కేంద్రం ఆదేశాలతోనే నన్ను టార్గెట్ చేశారు
  • అధికారం కంటే నిజం గొప్పది
  • విపక్షంలో ఉన్నందుకు గర్వంగా ఉంది

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News