Friday, January 17, 2025

రాజ్యాంగం దేశం డిఎన్‌ఎ: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగాన్ని దేశం డిఎన్‌ఎగా తమ పార్టీ పరిగణిస్తుంటుందని, కానీ అధికార బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అది‘ఖాళీ గ్రంథం’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం చెప్పారు. ఈ నెల 20 నాటి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు అమరావతిలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బిజెపి లక్షంగా విమర్శలు చేశారు. మహారాష్ట్రలో చేసినట్లుగా ఎంఎల్‌ఎల కొనుగోలు ద్వారా ప్రభుత్వాలను పడగొట్టవచ్చునని, అగ్ర వాణిజ్యవేత్తలకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేయవచ్చునని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని రాహుల్ చెప్పారు. ‘రాజ్యాంగాన్ని దేశం డిఎన్‌ఎగా కాంగ్రెస్ పరిగణిస్తుంటుంది, కానీ అధికార బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు అది ఖాళీ పుస్తకం’ అని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ తన ఎన్నికల ర్యాలీల్లో ఖాళీ పేజీలతో రాజ్యాంగం ప్రతిని ప్రదర్శిస్తున్నారని ప్రధాని మోడీ, బిజెపి ఇటీవల విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేనే ప్రస్తావించిన అంశం గురించే ప్రధాని నరేంద్ర మోడీ ఈమధ్య కాలంలో మాట్లాడుతున్నారని నా సోదరి నాతో చెప్పారు. కుల గణనను నిర్వహించాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితని తొలగించాలని లోక్‌సభలో ఆయనకు సూచించాను. నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకినని ఆయన ఇప్పుడు తన ఎన్నికల ర్యాలీల్లో చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుని వలె ఆయనకు జ్ఞాపక శక్తి లోపించింది’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుల గణనను వ్యతిరేకి అని ప్రధాని ఇప్పుడు అంటారని రాహుల్ ఆరోపించారు. ‘నేను దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వారి హక్కుల కోసం పోరాడుతున్నందున నా ప్రతిష్ఠను మసకబార్చేందుకు వారు కోట్లాది రూపాయలు వెచ్చించారు’ అని కూడా రాహుల్ ఆరోపించారు.

వస్తు సేవల పన్ను (జిఎస్‌టి), నోట్ల రద్దు రైతులను, చిన్న వ్యాపారులను చంపేందుకు ఆయుధాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందని, అందుకే సమాజంలో ద్వేషం విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘పారిశ్రామికవేత్తలు మిమ్మల్ని ప్రధానిగా ఎంచుకోలేదని, భారత ప్రజలు ఆ పని చేశారని మోడీజీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఆయనను పారిశ్రామికవేత్తలు ఆయనను మార్కెట్ చేశారన్నది నిజమే’ అని రాహుల్ చెప్పారు. ధన బలంతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హరించారని, ధారవి ప్రాజెక్టు కోసం చేసుకున్న ఒప్పందం అది అని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News