Thursday, January 23, 2025

రాహుల్ గాంధీతో తమిళ మహిళల పెళ్లి ముచ్చట్లు !

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఇష్టం కాబట్టి, అతడికి తమిళ అమ్మాయితో పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ మహిళ మాటామంతీ సందర్భంగా తెలిపింది.

న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి నిరసనగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు 150 రోజుల పాటు ‘భారత్‌ జోడో’ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతారు , ర్యాలీలు నిర్వహిస్తారు.  తమిళనాడులో రాహుల్ గాంధీ మహిళలతో సంభాషిస్తున్నప్పుడు జరిగిన వినోదభరితమైన సంఘటనను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పంచుకున్నారు. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఇష్టం కాబట్టి, అతడికి తమిళ అమ్మాయితో పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ మహిళ మాటామంతీ సందర్భంగా తెలిపింది.

“ఈ రోజు మధ్యాహ్నం మార్తాండమ్‌లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ సందర్భంగా, ఒక మహిళ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ  తమిళనాడును ప్రేమిస్తున్నాడని,  వారు అతనితో తమిళ అమ్మాయిని వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు” అని మిస్టర్ రమేశ్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News