Tuesday, December 3, 2024

హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, టి. సుబ్బిరామిరెడ్డి, రేణుక చౌదరీ, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, నిరంజన్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్, సమీరుల్లా, ఫహీం ఖురేషి, ఫేహీం, మెట్టు సాయి కుమార్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇక్కడి నుండి వారు నేరుగా ములుగు జిల్లాలో రామప్ప దేవాలయానికి బయలు దేరారు. దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ.లు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కర్డులకు పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News